గుంటూరులో నూతన డ్రైన్ నిర్మాణ పనులు 10 రోజుల్లో, నిర్మాణదశలో ఉన్న డ్రైన్లు 15 రోజుల్లో పూర్తీ చేయాలని, అందుకు ఇంజినీరింగ్ అధికారులదే భాధ్యత అని జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి సిఎం.సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తో కలిసి విభాగాధిపతులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత కమిషనర్ నగరపాలక సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులు, జనాభా, త్రాగునీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, రోడ్ల విస్తరణ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్, ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు జిఎంసి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, ప్రతి సమావేశానికి యాక్షన్ టేకెన్ రిపోర్ట్స్ తో అధికారులు హాజరు కావాలన్నారు. నగరంలో త్రాగునీటి కొరత లేకుండా అవసరమైన ప్రాంతాలకు ట్యాంకర్లు అందుబాటులో ఉంచాలన్నారు. నగరంలో ఎక్కడా డ్రైన్ క్రాస్ త్రాగునీటి పైప్ లైన్లు ఉండడానికి వీలు లేదని, ఏఈల వారీగా అలా క్రాసింగ్ లేవని సంతకంతో కూడిన సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. డిప్యూటీ కమిషనర్లకు కూడా పర్యవేక్షణ విధులు కేటాయించాలన్నారు. ఎక్కడైనా త్రాగునీటి పైప్ లైన్ లీకులు గుర్తిస్తే టాప్ ప్రయారిటీగా మరమత్తు చేయాలని, గతంలో జరిగిన విధంగా నగరంలో ఎక్కడా కలుషిత నీటి సరఫరా జరిగి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఇవ్వకూడదన్నారు. త్రాగునీటి సరఫరా సమయాలు ఒకే రీతిలో ఉండాలని, సరఫరా సమయంపై ప్రజలకు అవగాహన కల్గించాలన్నారు. సరఫరాలో లోపాలు తలెత్తకుండా అదనపు మోటార్లు, జనరేటర్లని సిద్దంగా ఉంచాలన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ పనుల్లో ప్రారంభం కాని వాటిని 15 రోజుల్లో ప్రారంభించాలన్నారు. నగరంలో మోడల్ గా 24/7 త్రాగునీటి సరఫరా పైలట్ ప్రాజెక్ట్ గా చేయాలన్నారు. ప్రతి పైప్ లైన్ ని ఎమినిటి కార్యదర్శులు తరువుగా ఆడిట్ చేసుకోవాలని, సచివాలయం పరిధిలో జరిగే సరఫరా లేదా సమస్యలకు సెక్రెటరీనే భాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ప్రజలు అందించే ఫిర్యాదుల పరిష్కారానికి చిత్తశుద్దితో చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో ఇక నుండి మొదలు పెట్టె డ్రైన్ వర్క్ లు 10 రోజుల్లో పూర్తీ కావాల్సిందేనని, ప్రస్తుతం ఉన్న పెండింగ్ పనులు 15 రోజుల్లో పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. డ్రైన్ వర్క్ ప్రారంభానికి ముందే ఆర్ఓడబ్ల్యు పట్టణ ప్రణాలిక విభాగం చేయాలని, యుటిలిటి విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్ పూర్తి చేసిన పిదపనే డ్రైన్ పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. నగరంలో విస్తారమైన రోడ్లు ఉన్నాయని, వాటిలో గ్రీనరీ పెంపుకు శ్రద్ధ చూపాలన్నారు. ఫుట్ పాత్ లు, స్ట్రామ్ వాటర్ డ్రైన్, గ్రీనరీ బెల్ట్, సెంట్రల్ లైటింగ్ వంటి అంశాలతోనే రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. నగరంలో ప్రధాన రోడ్ల అభివృద్ధిపై వచ్చే సమావేశానికి డిపిఆర్ సిద్దం చేయాలని ఎస్ఈని ఆదేశిచారు. జంక్షన్ల అభివృద్ధికి ట్రాఫిక్ రెగ్యులేషన్స్ తో కూడిన మంచి డిజైన్లతో తదుపరి సమావేశానికి రావాలన్నారు. పార్క్ లను మల్టి పర్పస్ యూజ్ రీతిలో ఆట స్తలాలుగా కూడా అభివృద్ధి చేయాలని, శ్మశానాలను దాతల సహకారంతో మోడల్ గా అభివృద్ధి చేయాలన్నారు. రోడ్లపై పాట్ హోల్స్ ఉండడానికి వీలు లేదని, వాటిని ఇష్టానుసారం కాకుండా రోడ్ లెవల్ కి ఉండేలా చేయాలని సూచించారు. ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నూతన లేయర్ చేయాలన్నారు. ఫుట్ పాత్ లను కూడా క్రమ పద్దతిలో చేయాలని, ఎగుడుదిగుడుగా చేయవద్దన్నారు. ప్రజారోగ్య విభాగంకి సంబంధించి మాట్లాడుతూ పారిశుధ్యం మెరుగవ్వాలని, ప్రధాన రోడ్ల శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. స్వచ్చ సర్వేక్షణ్ లో గతేడాది కంటే ఒక్క స్థానం తగ్గడానికి వీలు లేదన్నారు. కమర్షియల్ సంస్థలు, రోడ్ల పక్కన వ్యాపారాలు చేసేవారు చెత్త రోడ్లు, డ్రైన్లలో వేస్తె కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చెట్ల కొమ్మలు కూడా తొలగించాలన్నారు. ఏబీసిపై మాట్లాడుతూ జిజిహెచ్ లో వీధి కుక్కల కాటులపై వచ్చే వారి వివరాలు తీసుకొని, ఆయా ప్రాంతాల్లో ఏబీసికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఏబీసిని జిఎంసి సెంటర్లతో పాటుగా అర్హత కల్గిన ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాల్లో కూడా చేయిస్తే ఉత్తమ ఫలితం ఉంటుందని తెలిపారు. దోమల నియంత్రణపై మాట్లాడుతూ నీరు నిలిచే ప్రాంతాల్లో విస్తృతంగా గంబూషియా చేపలు వదలడం, డ్రైన్లలో లార్వా నాశక మందులు పిచికారీ, ఆయిల్ బాల్స్ వేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. రోడ్లు, డ్రైన్ల నిర్మాణ సమయంలో రైట్ ఆఫ్ వే (ఆర్ఓడబ్ల్యు) క్లియరెన్స్ భాధ్యత పట్టణ ప్రణాళిక విభాగానిదేనన్నారు. నగరంలో హోర్డింగ్స్ అడ్డదిడ్డంగా ఉన్నాయని, వారికి తెలియచేసి, స్పందించకుంటే తొలగించాలన్నారు. డివైడర్లలో లాలి పప్స్, ఫ్లేక్సీలు వంటి వాటిని తొలగించాలని, ప్రధానంగా అన్ని జంక్షన్లలో 3 రోజుల్లో అనధికార హోర్డింగ్స్, బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు. పోస్టర్స్ ప్రింట్ చేసేవారు, అంటించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, అంటించిన వారికి అపరాధ రుసుం విధించి, వారితోనే శుభ్రం చేయించి, పెయింట్ కూడా చేయించాలని, అందుకు ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. నగరంలో 50 శాతం గ్రీన్ బెల్ట్ కవరేజ్ ఉండే లక్ష్యంతో వచ్చే ఏడాదికి 25 శాతం సాధించేలా తదుపరి సమావేశానికి సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని ఆదేశించారు.కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్(ఇంచార్జి) జి.సాంబశివరావు, డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, సిపి రాంబాబు, సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎస్ఈ వెంకటేశ్వరరావు, పిఓ సింహాచలం, మేనేజర్ బాలాజీ బాష పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: గుంటూరులో డ్రైన్ ల నిర్మాణం వేగవంతం చేయాలి

Total Views: 0
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
few clouds
32° _ 32°
62%
4 km/h
Wed
32 °C
Thu
43 °C
Fri
43 °C


