గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న పేదల సంక్షేమం కోసం తన వంతు సహాయాన్ని అందిస్తాన్ని, ఇందులో భాగంగా మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 3 మహిళలకు వారి జీవనోపాధి కోసం తోపుబండ్లు పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళల సమస్యలను నేరుగా తెలుసుకుని, వెంటనే పరిష్కార మార్గాలు చూపించే ఉద్దేశంతో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమలో మహిళలకు అండగా నిలవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. జీవనోపాధి కోసం టిఫిన్ బండ్లు, కూరగాయల బండ్లు, పూల వ్యాపారం చేసుకునేందుకు బండ్లు కావాలని గత రెండు వారాలుగా మహిళలు విజ్ఞప్తి చేశారని తెలిపారు. వారి అభ్యర్థనలను పరిశీలించి, అవసరమైన బండ్లను సిద్ధం చేసి ఈ వారం మహిళలకు అందజేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.అలాగే రెవెన్యూ, పోలీస్ స్టేషన్ సమస్యలు, శానిటేషన్, రోడ్లు వంటి ప్రజా సమస్యలతో మహిళలు పెద్ద ఎత్తున తమ వద్దకు వస్తున్నారని, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పటికే మహిళలు తీసుకొచ్చిన సమస్యల్లో సుమారు 80 శాతం వరకు పరిష్కారం చేసినట్లు ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మిగిలిన సమస్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. మహిళా నాయకులు, పార్టీ క్యాడర్ సహకారంతో ప్రజలకు మరింత చేరువగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలు అందజేసిన వినతులు నూనె మరియమ్మ అనే మహిళ తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. సంపత్ నగర్ 9వ లైన్ 2వ అడ్డరోడ్డులో ఇళ్లకు ఆనుకొని విద్యుత్ లైన్ ఉండటంతో ప్రమాదకర పరిస్థితి నెలకొన్నదని కే. శాంతి నాయక్ ఫిర్యాదు చేశారు.బొడ్డుపల్లి జయలక్ష్మి అనే యువతి తనకు ఉపాధి కల్పించాలని వినతి పత్రం అందజేశారు.చెరుకూరి సుబ్బాయమ్మ తన బ్రతుకుతెరువుకు సహాయం చేయాలని కోరగా, బి. నవ్య అనే యువతి 2018-19 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ బకాయిలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆషా అనే మహిళ తాను హృద్రోగ సమస్యతో బాధపడుతున్నానని, వైద్య సహాయం అందించాలని కోరారు.మదమంచి ఉమా అనే మహిళ అశోక్ నగర్ 1వ లైన్లో టీ స్టాల్ ఏర్పాటు చేసుకునేందుకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. షేక్ మౌలాబీ అనే మహిళ కిడ్నీ పెన్షన్ మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.28వ డివిజన్ సీతమ్మ కాలనీ “0” లైన్లో నిలిచిపోయిన వాటర్ ప్లాంట్ వద్ద కొంతమంది యువకులు గంజాయి సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహిళలు ఫిర్యాదు చేశారు. మహిళల సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటూ, జీవనోపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్న ఎమ్మెల్యే గళ్ళా మాధవి సేవలను మహిళలు అభినందించారు.
GUNTUR CITY NEWS: మహిళల జీవనోపాధికి తోపుబండ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
34°C
Vijayawada
overcast clouds
34° _ 34°
46%
5 km/h
Sun
33 °C
Mon
34 °C
Tue
37 °C


