WORLD BRAIN TUMOR DAY:బ్రెయిన్ ట్యూమర్‌పై న్యూరో డాక్టర్ల హెచ్చరిక..! ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో “ది గుంటూరు 3K బ్రెయిన్ రన్”

City News Telugu

ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా గుంటూరులో విజయవంతంగా నిర్వహించిన “ది గుంటూరు 3K బ్రెయిన్ రన్”

గుంటూరు, జూన్7: జూన్ 8 న ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు న్యూరోసైంటిస్ట్స్ అసోసియేషన్ మరియు న్యూరోక్యూర్ సంయుక్త ఆధ్వర్యంలో “ది గుంటూరు 3K బ్రెయిన్ రన్” విజయవంతంగా నిర్వహించారు. బ్రెయిన్ ట్యూమర్‌పై అవగాహన కల్పించడం, మెదడు ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు చైతన్యం తీసుకురావడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

“గో గ్రే ఇన్ మే” (Go Gray in May) అవగాహన ప్రచారంలో భాగంగా నిర్వహించిన ఈ 3కే బ్రెయిన్ రన్ జూన్ 7వ తేదీ ఆదివారం ఉదయం లక్ష్మీపురంలోని మదర్ థెరిస్సా విగ్రహం వద్ద ప్రారంభమై గుజ్జులగుండ సెంటర్ వరకు కొనసాగింది. వైద్యులు, వైద్య విద్యార్థులు, స్వచ్ఛంద కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పి. విజయ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బ్రెయిన్ ట్యూమర్‌ను ముందస్తుగా గుర్తించడం ద్వారా చికిత్స విజయవంతమయ్యే అవకాశాలు పెరుగుతాయని, తలనొప్పి, ఫిట్స్, చూపు మందగించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలకు సూచించారు.

ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ వి. రామతారకనాథ్ మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్‌కు సంబంధించిన ప్రారంభ లక్షణాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి తలనొప్పి బ్రెయిన్ ట్యూమర్ కాకపోయినా, కొన్ని హెచ్చరిక సంకేతాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు.

లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఆధునిక వైద్య సాంకేతికతతో బ్రెయిన్ ట్యూమర్ చికిత్సలో గణనీయమైన పురోగతి సాధించామని, ముందస్తు నిర్ధారణ వల్ల చికిత్స ఫలితాలు మరింత మెరుగుపడతాయని తెలిపారు.

కార్యక్రమానికి అధ్యక్షత వహించిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సి.హెచ్. శివరామకృష్ణ మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్‌పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. భయం కంటే అవగాహన ముఖ్యమని, సకాలంలో వైద్యులను సంప్రదించడం ద్వారా మెరుగైన చికిత్స పొందవచ్చని తెలిపారు.

గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ గాజుల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ, మెదడు ఆరోగ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదిస్తే చికిత్స మరింత సమర్థవంతంగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.

కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ హేమంత్ ఉప్పుటూరి మాట్లాడుతూ, బ్రెయిన్ ట్యూమర్‌పై ఉన్న అపోహలను తొలగించి శాస్త్రీయ అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో వైద్యులను సంప్రదించడం ద్వారా మెరుగైన చికిత్స ఫలితాలు పొందవచ్చని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐఎంఏ అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ బి. సాయికృష్ణ, గుండె వైద్య నిపుణులు డాక్టర్ అంజిత్ ఉప్పుటూరి ప్రత్యేకంగా పాల్గొన్నారు.

అలాగే విజయ్ డిజిటల్ ప్రొప్రైటర్ శ్రీ జవ్వాది గంగాధరరావు, రోటరీ క్లబ్ ఆదర్శ్ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ మన్నే తమ సంపూర్ణ సహకారాన్ని అందించారు.

“మీ ఆరోగ్యం కోసం పరిగెత్తండి – మెదడు కోసం పరిగెత్తండి (Run for Your Health, Run for Brain)” అనే సందేశంతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

అనంతరం నిర్వహించిన పోటీల్లో విజేతలకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో గుంటూరు నగరానికి చెందిన న్యూరాలజిస్టులు, న్యూరోసర్జన్లు, బ్రెయిన్ ఆంకాలజిస్టులు, న్యూరో పాథాలజిస్టులు, రేడియాలజిస్టులు, న్యూరో క్రిటికల్ కేర్ నిపుణులు, వైద్య విద్యార్థులు మరియు ఆరోగ్య కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share This Article
Leave a review