GUNTUR CITY NEWS: సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమర్థవంతంగా పూర్తి చేయాలి – ఎమ్మెల్యే మాధవి

Karthik

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సర్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సమర్థవంతంగా పూర్తి చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. ఆదివారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయం (అరండల్‌పేట)లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి అధ్యక్షతన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సు మరియు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జీలు, బిఎల్ఏ లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… సర్ అనేది ఓటరు జాబితాలను ప్రక్షాళన చేసి, అర్హులైన నిజమైన ఓటర్లను గుర్తించే అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ఒక ప్రాంతంలో నివసించే అర్హులైన పౌరులకే ఓటు హక్కు ఉండేలా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని వివరించారు.2002లో చేపట్టిన సమగ్ర ఓటరు సర్వే తర్వాత అనేక మార్పులు చోటుచేసుకున్నాయని, కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, మరికొందరు కొత్తగా చేరడం, మరణాలు, వివాహాల కారణంగా చిరునామాలు మారడం వంటి పరిణామాల నేపథ్యంలో ఓటరు జాబితాలను నవీకరించడం అవసరమైందన్నారు. నిజమైన ఓటర్లను గుర్తించి ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సర్ ఉపయోగపడుతుందని చెప్పారు.నిజాయితీగా ప్రజల మద్దతు ఉన్న నాయకత్వానికి ఈ ప్రక్రియపై ఎలాంటి భయం అవసరం లేదని, ప్రజల విశ్వాసంతో పనిచేసే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటివరకు పార్టీ పట్ల ఎంత నిబద్ధతతో పనిచేశారో, అదే స్థాయిలో ఈ ప్రక్రియ పట్ల కూడా బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి బూత్ ఇంచార్జి తమ పరిధిలోని ప్రతి ఓటరును గుర్తించి, నిబంధనల ప్రకారం వివరాలను నమోదు చేయాలని, ఎన్నికల సంఘం నిర్దేశించిన విధానాలను తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు. సాంకేతిక అంశాలపై ఎవరికి ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే సంబంధిత నాయకులు, పార్టీ కార్యాలయం లేదా సాంకేతిక బృందాన్ని సంప్రదించి నివృత్తి చేసుకోవాలని సూచించారు.ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌లకు తావు ఇవ్వకూడదని, ఇతర పార్టీలు చేసే ప్రతి చర్యపై అప్రమత్తంగా ఉండటంతో పాటు, పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని సూచించారు.అలాగే ఐదు రోజుల తర్వాత మరో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి, ఫీల్డ్‌లో ఎదురైన సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలు సూచిస్తామని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి BLA పనితీరుపై పూర్తి స్థాయి మానిటరింగ్ ఉంటుందని, అందరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.”SIR ప్రక్రియ తెలుగుదేశం పార్టీకి ప్రతిష్టాత్మకమైన అంశం. కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అని ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నిమ్మల శేషయ్య, తాళ్ళ వెంకటేష్, గవిని సతీష్ మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review