Bapatla Local News :పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత-తహసీల్దార్ షేక్ సలీమా

Sharat
2 Views

బాపట్ల, జూలై 30 :– పౌర హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని బాపట్ల మండల తహసీల్దార్ షేక్ సలీమా పేర్కొన్నారు. బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో గురువారం నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవ కార్యక్రమానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.

భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులను కల్పించిందని, కులం, మతం, వర్ణం, లింగ భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు, గౌరవప్రదమైన జీవనం అందించేలా రాజ్యాంగం హామీ ఇస్తుందని తెలిపారు. ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకుని సద్వినియోగం చేసుకోవడంతో పాటు రాజ్యాంగం నిర్దేశించిన విధులను కూడా బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా, ఎలాంటి వివక్ష లేకుండా అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. సమాజంలో సామరస్యం, సమానత్వం, సామాజిక న్యాయం నెలకొల్పడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పౌర హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మండల స్థాయి అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు.

కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్థులను తహసీల్దార్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాబూరావు, ఎంఈఓ నిరంజన్, డిప్యూటీ ఎంపీడీవో పల్నాటి శ్రీరాములు, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సత్యనారాయణతో పాటు మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review