GUNTUR DISTRICT NEWS: రైతులు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన లో చేరాలి – ఆగస్టు 15 లోపు వరి పంట పండించే రైతులు పంటల భీమా చేయించుకోవాలి

Karthik

పెదకాకాని మండలంలోని నంబూరు గ్రామంలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఏపీ సీ ఎన్ ఎఫ్ ( పకృతి వ్యవసాయం) మరియు డి ఆర్ డి ఏ ( జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ) సంయుక్తంగా రైతులకు మరియు సిబ్బందికి పొలం పిలుస్తుంది కార్యక్రమం చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి గుంటూరు డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ యన్. మోహన్ రావు అధ్యక్షత వహించారు. అదేవిధంగా ఏపీ సిఎన్ఎఫ్ డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ కే రాజకుమారి, మరియు పెదకాకాని మండల ఏపిఎం. బి. రాజుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడీఏ మోహన్ రావు మాట్లాడుతూ,మండలంలో వరి పంట వేసిన ప్రతి ఒక్క రైతు ఆగస్టు 15వ తారీకు లోపు PMFBY పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు. ఈ సంవత్సరం ఎల్ నినో ప్రభావం ఉండటం వలన, పంట దిగుబడుల మీద ప్రభావం ఉన్నందున పంటల భీమా వర్తించే అవకాశం ఉన్నది కావున, ప్రతి ఒక్క రైతు వరి పంటకు ఎకరానికి 800 రూపాయలు కామన్ సర్వీస్ సెంటర్ లో కట్టుకోవాలని తెలిపినారు. బ్యాంకులో వరి పంటకు లోన్ తీసుకున్నవాళ్లు బ్యాంకు లో ప్రీమియం కట్టుకోవచ్చునని తెలిపారు, మరియు మిరప పంటకు ఎకరానికి 2700/-,మినుము పంటకు ఎకరానికి 200/- లు చొప్పున కట్టుకొని భీమాలో చేరవచ్చునని తెలిపారు, APAIMS యాప్ ద్వారానే ఎరువులు ఇస్తామని, ఎరువులకు ఎటువంటి కొరత లేదని తెలిపారు, అదేవిధంగా డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు విత్తనం విత్తే ముందు బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన ఎడల పంట కాలంలో వచ్చు తెగుళ్ళ తగ్గించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో కిచెన్ గార్డెన్ కూడా ప్రతి ఇంటిలో పెంచుకోవాలని తెలిపినారు. ఏపిఎం బి రాజు మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు డి ఆర్ డి ఏ వెలుగు సిబ్బంది అందరూ సంయుక్తంగా ప్రతి ఒక్క గ్రామంలో పంటల భీమా గురించి తెలిపి ఆగస్టు 15వ తారీకు లోపు ప్రతి ఒక్కరిని పంటల బీమా చేయించుకోవాలని మరియు వారి పరిధిలోని మండల సమాఖ్యలోని రైతులను పంటల బీమా గురించి తెలిపి ఆగస్టు 15వ తారీకు లోపు వరికి ఎకరానికి 800 రూపాయలు కట్టించాలని తెలిపారు. తదుపరి పొలం పిలుస్తోంది లో భాగంగా అక్కడ హాజరైన రైతులందరికీ జీవామృతం. బీజామృతం విత్తన గుళికలు తయారీ విధానం రైతుల చే చేయించి చూపించినారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ అధికారి రమణ,VAA లు, ZBNF సిబ్బంది, వెలుగు సిబ్బంది మరియు ఆదర్శ రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తరువాత ADA, మరియి MAO లు గ్రామంలో ఉన్న SBI, CGGB బ్యాంకు మేనేజర్ లను కలసి, వారితో చర్చించి వరి పంట కు లోన్ తీసుకున్న వారికీ, బీమా ప్రీమియం కట్ చేసుకునేందుకు వారిని ఒప్పించారు.

Author
Share This Article
Leave a review