Hyderabad City News :ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి- ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్

Sharat
1 View

హైదరాబాద్:– అక్రమాలకు పాల్పడిన ఇంజనీరింగ్‌ కళాశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విచారణకు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. శనివారం అబిడ్స్ నుంచి ప్రారంభమైన ‘చలో సెక్రటేరియట్’ ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనను పోలీసులు బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా ఎంపీ ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ, కొన్ని కళాశాలలు చేసిన తప్పులకు మొత్తం అన్ని కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిపివేయడం ఏమాత్రం తగదన్నారు. గత మూడేళ్లుగా బకాయిలు విడుదల కాకపోవడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు బకాయిల సమస్య కారణంగానే ఈ ఏడాది ఇంజనీరింగ్ కళాశాలల్లో 50 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని పేర్కొన్నారు.Hyderabad city news

అవకతవకలకు పాల్పడిన కళాశాలల గుర్తింపును రద్దు చేసి, నిబంధనలు పాటించే మిగతా కళాశాలలకు వెంటనే రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల పట్ల తన వైఖరిని మార్చుకుని, పాత పద్ధతిలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించాలని ఈ సందర్భంగా ఆర్‌.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.

Author
Share This Article
Leave a review