ఫిరంగిపురం మండలంలోని సిరంగి పాలెం గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది, ఈ కార్యక్రమంలో గుంటూరు సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్ మోహన్ రావు మరియు మండల వ్యవసాయ అధికారిని జే వాసంతి గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ మోహన్ రావు రైతులతో మాట్లాడుతూ ప్రత్తి లో గులాబీ రంగు కాయ దోలుచు పురుగు నివారణకు కేవలం పురుగు మందుల మీదే ఆధారపడకుండా, సమగ్ర సస్యరక్షణ పాటించాలని తెలిపినారు మొదటిగా లోతుగా దుక్కులు వేసుకోవాలని,తరువాత నుంచి 45 రోజుల దశలో ఎకరానికి 6 నుండి 8 లింగాకర్షకు బుట్టలు అమర్చుకోవాలని, పురుగు గుడ్డు దశలో ఐదు శాతం వేపగింజల కషాయాన్ని మరియు ప్రొఫెనోఫాస్ మందులు వాడిన ఎడల పురుగుల గుడ్లు పొదగ కుండా చనిపోతాయని, అలాగే పొలంలో రెండు నుండి నాలుగు పక్షిస్తావరాలను ఏర్పాటు చేసుకోవాలని, అలాగే పురుగు చివరి దశలో మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్స్ అయిన సై ఫర్ మెత్రిన్, ఫెన్వెలేరేట్,మరియు లాందొసైహలోత్రిన్ లాంటి మందులు వాడుకోవాలని తెలిపినారు, అలాగే ప్రస్తుతం వర్షాభావ పరిస్థితుల్లో నీరు తక్కువగా పట్టే మినుము మరియు పెసర లాంటి పంటలను సాగు చేసుకోవాలని ఈ పంటలకు సంబంధించిన విత్తనాలను రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకొని 80 శాతం రాయితీపై పొందవచ్చునని తెలిపినారు అలాగే ప్రతి రైతు ప్రభుత్వం జారీ చేయు రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) రైతు సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపినారు, భవిష్యత్తులో వ్యవసాయ శాఖ ద్వారా జరుగు అన్ని కార్యక్రమాలు ఈ యొక్క ఫార్మర్ ఐడి సంఖ్య ద్వారానే జరుగుతాయని తెలిపినారు, ఇకనుండి ఈ విశిష్ట సంఖ్య (ఫార్మర్ ఐడి) ఉంటేనే రైతులు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ లాంటి పథకాలకు అర్హులవుతారని తెలిపినారు, మండల వ్యవసాయ అధికారిణి వాసంతి మాట్లాడుతూ పంట వేసిన ప్రతి రైతు ఈ క్రాప్ బుకింగ్ చేసుకుని, ekyc చేయుంచుకోవాలని తెలిపారు ఈ నెల చివరి నాటికీ ఈ క్రాప్ బుకింగ్ కంప్లీట్ చేయాలనీ తెలిపారు,ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ సుభాని, RSK గ్రామ వ్యవసాయ సహాయకులు మరియు గ్రామ ఆదర్శ రైతులు పాల్గొన్నారు.



