కనిగిరి:- నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 131వ జయంతి వేడుకలు కనిగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆదేశాల మేరకు ఆర్‌అండ్‌బీ బంగ్లా వద్ద ఉన్న జాషువా విగ్రహానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అంటరానితనం, కుల వివక్ష, సామాజిక అసమానతలు, మూఢనమ్మకాలపై తన సాహిత్యంతో జాషువా బలమైన పోరాటం చేశారని తెలిపారు. అణగారిన వర్గాల బాధలను, సామాజిక వివక్షను తన రచనల ద్వారా ప్రజల ముందుకు తీసుకువచ్చి సమాజ చైతన్యానికి కృషి చేశారని పేర్కొన్నారు.
సాహిత్యాన్ని కేవలం వినోదానికి పరిమితం చేయకుండా సమాజ సంస్కరణకు ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచిన మహాకవి జాషువా అని కొనియాడారు. సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన సాగించిన సాహితీ ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. జాషువా ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.Markapur District News :వెలిగొండ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం-సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం- ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
జాషువా రచనలు సమాజంలోని అసమానతలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయని, ఆయన చూపిన మానవతా మార్గం ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాషువాకు ఘన నివాళులర్పించారు.



