GUNTUR DISTRICT NEWS: జగనంత దైవం – జగమంత కుటుంబం – నా సొంతం – ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి

Karthik

వాడవాడలా వేడుకలు నిర్వహించడం ద్వారా తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ శాసనమండలి సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బృందావన్ గార్డెన్స్‌లోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ పాపతోటి అంబేద్కర్ ఆధ్వర్యంలో లేళ్ళ అప్పిరెడ్డి ఆరోగ్యాన్ని, మరింత ఉన్నతిని కాంక్షిస్తూ క్రైస్తవ మత పెద్దలు బుధవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఏటీ అగ్రహారానికి చెందిన పులి శ్రీనివాసరెడ్డి, దొంతిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని ఘనంగా చాటుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ, జగనంత దైవం – జగమంత కుటుంబం కలిగిన తాను ఎంతో అదృష్టవంతుడినని అభిప్రాయపడ్డారు. తనకు తోడబుట్టిన వారు కాకపోయినా.. విశేషమైన ఆదరాభిమానాలు చూపిస్తున్న వారంతా తన సొంత కుటుంబ సభ్యులేనని ఆయన స్పష్టం చేశారు. అలాగని ఇలా ఏదో రెండు మాటలు చెప్పినంత మాత్రాన ఈ రుణం తీరదన్న వాస్తవం తనకు తెలుసని ఆయన అన్నారు. అందుకే వారికి అన్ని విషయాలలో అండగా నిలుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో ఈ బంధం మరింత బలపడి జన్మజన్మల అనుబంధంగా మారుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), షేక్ రోషన్, పడాల సుబ్బారెడ్డి, దూపాటి వంశీ, బోడపాటి కిషోర్, కాకి శ్రీనివాసరావు, కేసరి సుబ్బులు, ఆలా కిరణ్, పరిశపోగు భరత్, బాలిరెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review