BAPATLA DISTRICT CITY NEWS:పేరలి–తుమ్మలపల్లి రహదారికి రూ.2 కోట్లతో శంకుస్థాపన

City News Telugu

బాపట్ల, అక్టోబర్ 7: కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు అన్నారు.

కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో జిరాంజి నిధులు రూ.2 కోట్లతో పేరలి నుంచి తుమ్మలపల్లి తారు రోడ్డు వరకు నిర్మించనున్న రహదారి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పేరలి బాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పేర్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సుమారు రూ.40 కోట్లతో రోడ్లు, వంతెనలు, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

పేరలి నుంచి తుమ్మలపల్లి వరకు తారు రహదారి పూర్తయితే ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.Bapatla District News

కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు షేక్ బాజీ, పేరలి బాలకృష్ణమూర్తి, దుర్గాప్రసాద్, బీజేపీ నాయకులు షేక్ కరిముల్లా, మద్దాల ముసలయ్య, జోగి సురేష్, పిట్ల వేణుగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మద్దిబోయిన బుల్లియ, రామరాజు, ఆంద్రేయ, అల్లం గోపి, కోమట్ల కృష్ణ, చలపతి రెడ్డి, మల్లారపు వీరయ్య, దేవరంపాటి రాజా, మాడ శ్రీనివాసరావు, దోప్పలపూడి రాజశేఖర్, కుమ్మరి కుంట దాసు తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a review