Eluru District City News :ఉంగుటూరు జడ్పీటీసీ అభ్యర్థిగా పాతూరి రత్నూష నామినేషన్

S Sarath
1 View

ఉంగుటూరు:-ఉంగుటూరు మండల జడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పాతూరి రత్నూష శుక్రవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకుల నిర్ణయం మేరకు ఆమె నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు.

ఈ సందర్భంగా పాతూరి రత్నూష మాట్లాడుతూ విద్యాధికురాలిగా తనను జడ్పీటీసీ అభ్యర్థిగా గెలిపిస్తే మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కూటమి పెద్దల ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి కూడా పోటీ చేసే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఉంగుటూరు నియోజకవర్గంలోని కూటమి నాయకుల సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు. కూటమి నాయకులు ఎవరిని ఎంపిక చేసినా వారి విజయానికి కృషి చేస్తామని, అన్ని ఎంపీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు సహకరిస్తామని పాతూరి విజయ్ మీడియాకు వెల్లడించారు.Eluru district news

ఉంగుటూరు మండల ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపించి, మండల అభివృద్ధికి సేవ చేసే అవకాశం కల్పించాలని పాతూరి రత్నూష కోరారు. ప్రజల ఆశీర్వాదంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Author
Share This Article
Leave a review