మల్లావరపు సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవం రేపు

Rambabu k
6 Views

హైదరాబాద్, నవంబర్ 2: ప్రముఖ కవి, గీత రచయిత, గోదావరి గొంతుకగా పేరొందిన మల్లావరపు సదాశివుడు స్మారక పురస్కార ప్రదానోత్సవాన్ని తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో నవంబర్ 3న నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఆడిటోరియంలో సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది.

తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు వనపట్ల సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి కే.వి. రామారావు ముఖ్య అతిథిగా, ప్రముఖ కవి గోరటి వెంకన్న విశిష్ట అతిథిగా, దేశపతి శ్రీనివాస్ ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. దేవీప్రసాద్, ఆయాచితం శ్రీధర్, విరాహత్ అలీ గౌరవ అతిథులుగా పాల్గొననున్నారు.

2024-25 సంవత్సరానికి సంబంధించిన మల్లావరపు సదాశివుడు స్మారక పురస్కారాన్ని చమన్ సింగ్‌కు, 2025-26 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాన్ని సంగిశెట్టి శ్రీనివాస్‌కు ప్రదానం చేయనున్నారు. అలాగే విశిష్ట సాహిత్య, సాంస్కృతిక సేవలందించిన పలువురికి ప్రత్యేక సత్కారాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Author
Share This Article
Leave a review