Palnadu District News :వినుకొండలో వైఎస్సార్‌సీపీకి 9 వార్డుల విజయం-గెలుపొందిన కౌన్సిలర్లకు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సత్కారం

S Sarath
1 View

వినుకొండ: వినుకొండ మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయం సాధించిన 9 మంది కౌన్సిలర్లను మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సత్కరించి అభినందించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విజయం సాధించిన కౌన్సిలర్లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు.

ఈ సందర్భంగా బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులు, పోలీసు బలగాల మోహరింపు వంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ పార్టీ అభ్యర్థులు వెనక్కి తగ్గకుండా ఎన్నికల బరిలో నిలిచారని పేర్కొన్నారు. అన్ని ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ధైర్యంగా పోరాడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున 8 మంది, మిత్రపక్షమైన సీపీఐ తరఫున ఒకరు కౌన్సిలర్లుగా విజయం సాధించడం సంతోషకరమన్నారు.Palnadu District news

ప్రజల మద్దతుతో విజయం సాధించిన కౌన్సిలర్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయం సాధించిన కౌన్సిలర్లకు అభినందనలు తెలిపారు.

Author
Share This Article
Leave a review