అమరావతి, నవంబర్ 4: అర్నబ్, మురసు తుపానుల కారణంగా నష్టపోయిన బాధితుల సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం వీఐటీ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ జి. విశ్వనాథన్ రూ.కోటి విరాళంగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ఈ మొత్తాన్ని అందించారు.
బుధవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.కోటి డిమాండ్ డ్రాఫ్ట్‌ను అందజేశారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాష్ట్ర ప్రజలకు అండగా నిలవడం వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం నైతిక బాధ్యతగా భావిస్తోందని ఈ సందర్భంగా డాక్టర్ జి. విశ్వనాథన్ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు, విపత్తుల సమయంలో సహాయ చర్యలు, సమాజ అభివృద్ధి కార్యక్రమాలకు వీఐటీ విశ్వవిద్యాలయం నిరంతరం తన వంతు సహకారం అందిస్తోందని తెలిపారు.Amaravathi News
ఈ కార్యక్రమంలో వీఐటీ వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ శంకర్ విశ్వనాథన్, డాక్టర్ శేఖర్ విశ్వనాథన్, వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి పాల్గొన్నారు.


