నగరంలోని జిల్లా పరిషత్ (ZP) కాంపౌండ్లో గల శ్రీ సత్యసాయి శాంతి సుధ శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ లక్ష్మీ అపర్ణ కోవెలమూడి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుంటూరు నగర మేయర్గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా సమితి సభ్యులు అపర్ణని సన్మానించి, ఆత్మీయ శుభాకాంక్షలు తెలియజేశారు. తనపై చూపిన ఆదరాభిమానాలకు, అందించిన ఆశీస్సులకు అపర్ణ సమితి సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుని ఆశీస్సులతో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, గుంటూరు నగర అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తానని పేర్కొన్నారు.



