Bapatla City News: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ

Sharat
1 View

ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభను విజయవంతం చేయాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాలకొండ నియోజకవర్గ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, స్థానిక టీడీపీ ఇన్‌చార్జి పడాల భూదేవితో కలిసి మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సభ ఏర్పాట్లు, ప్రజల తరలింపు, పార్టీ శ్రేణుల సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, కృషి ఫలితంగానే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు సాకారమైందని అన్నారు.

ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి పాలకొండ నియోజకవర్గం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. బూత్ స్థాయి నుంచి పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని సూచించారు.

సమీక్షా సమావేశంలో పాలకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నాయకులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జులు, బూత్ ఇన్‌చార్జులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review