సీఎం చంద్రబాబు ఈ నెల 30వ తేదీన సి.ఆర్.డి.ఏలో జరగనున్న కార్యక్రమానికి హాజరుకానున్న దృష్ట్యా బుధవారం జిల్లా కలెక్టర్ సి.ఎం సాయికాంత్ వర్మ ఏర్పాట్లను పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ తో కలిసి పరిశీలించారు. ఈ నెల 25వ తేదీన ముంబాయి వేదికగా “బిజినెస్ రిఫార్మర్” అవార్డును ముఖ్యమంత్రి అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవార్డును వ్యక్తిగత అవార్డుగా కాకుండా టీం అవార్డుగా భావిస్తూ తన ఔన్నత్యాన్ని తెలియజేయడమే కాకుండా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నస్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బందితో సహా అందరి భాగస్వామ్యం ఉందని, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బంది నుండి రాష్ట్ర సచివాలయం ఉన్నత అధికారులైన ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు., రాష్ట్ర మంత్రులతో అవార్డు విశేషాలను పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు తనిఖీ చేసి ఎటువంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి.ఆర్.డి.ఏ అదనపు కమిషనర్ లు భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, గుంటూరు రెవిన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీనివాస రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ కె.కళ్యాణ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, రవాణా శాఖ ఉప కమిషనర్ సీతారామిరెడ్డి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం శ్రీనివాసరెడ్డి, తుళ్ళూరు తహసీల్దార్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు.



