Palnadu District City News :ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం- వినుకొండలో ‘స్పిరిచువల్ టాబ్లెట్స్’ క్యాంపును ప్రారంభించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు

Sharat
1 View

వినుకొండ (ప్రత్యేక ప్రతినిధి): వేల కోట్ల సంపద కంటే ఆరోగ్యమే మహాభాగ్యమని, శారీరక, మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు.

శనివారం వినుకొండ పట్టణంలోని శ్రీనివాస్ నగర్‌లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో పిరమిడ్ ధ్యాన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్పిరిచువల్ టాబ్లెట్స్’ శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ… ఆధునిక జీవనశైలిలో ఒత్తిడిని జయించటానికి, సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటానికి ధ్యానమే సరైన మార్గమని పేర్కొన్నారు. మానసిక ప్రశాంతత లభించినప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలడని, రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలని సూచించారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనించడం ద్వారా సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వాలు పెంపొందుతాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పిరమిడ్ ధ్యాన మండలి ప్రతినిధులు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Author
Share This Article
Leave a review