GUNTUR CITY NEWS: పోలేరమ్మ తల్లి ఆలయంలో వైభవంగా దసరా మహోత్సవాలు

Karthik

గుంటూరు చుట్టుగుంట పోలేరమ్మ తల్లి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఆదివారం పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే మాధవి అనంతరం ప్రత్యేక పూజలు పాల్గొని, దేవస్థానం కమిటీ సభ్యులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నెల 11 నుండి 20వ తేదీ వరకు శ్రీ దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భక్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అదేవిధంగా దసరా మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు అడకా శ్రీనివాసరావు, అంగడి శ్రీనివాసరావు, తుమ్మల నాగేశ్వరరావు యన్నం సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review