GUNTUR DISTRICT NEWS: దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ లో తగలబడిన పసుపుకు ఇప్పటికైనా నష్టపరిహారం చెల్లించండి

Karthik

సోమవారం కలెక్టరేట్ లో పసుపు రైతులు భిక్షాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడుతూగత రెండున్నర సంవత్సరాల క్రితం దుగ్గిరాల లోని శుభమ్ మహేశ్వరి గోల్డ్ స్టోరేజీ దగ్ధమై సుమారు 300 మంది రైతులు సంబంధించిన పసుపు తగలబట్టడం జరిగింది. ఈ తగలబడిన పసుపు కు వెంటనే తమకు పరిహారం చెల్లించాలని రకరకాల రూపంలో రైతులు అధికారులకు, ప్రజాప్రతినిధులు కు వినతి పత్రాలు తో పాటు, ధర్నాలు, రాస్తారోకో, నిరాహార దీక్షలు ఆందోళనలోతో ఉద్యమం చేపట్టడం జరిగింది.ఆరోజు ప్రతి పక్షం లో ఉన్న టిడిపి నాయకులు నారా లోకేష్ , పెమ్మసాని చంద్రశేఖర్ తదితర కూటమి నాయకులు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి రైతుకు పూర్తిస్థాయిలో దగ్ధమైన పసుపు పంటకు పరిహారం చెల్లిస్తామని రైతులు చేస్తున్న ఆందోళనలో మద్దతు తెలిపి వాగ్దానం చేయడం జరిగింది. అధికారంలోకి వచ్చి తర్వాత నేటికీ రెండు సంవత్సరాలు దాటినప్పటికీ ఇప్పటికీ కూడా దగ్ధమైన పసుపుకు నష్టపరిహారం ఇప్పించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. కోల్డ్ స్టోరేజి యాజమాన్యం మరియు ప్రభుత్వం అధికారులతో చర్చలు జరిపి 7వేల రూపాయలు ఇస్తామని బలవంతంగా రైతులను ఒప్పించడం జరిగింది. ఆనాడు రేటు క్వింటాలుకు 15,000 రూపాయలు ఉండటం జరిగింది.కానీ అంగీకరించిన పద్ధతి ప్రకారం 7, 000 రైతులకు ఇవ్వకుండా 4000, 5000 వేలు మాత్రమే చెల్లిస్తామని నోటీసులు పంపించడం, బ్యాంకులో రైతులకు డబ్బులు వేయటం కూడా జరిగింది అన్నారు.కానీ 7000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చి దాన్ని కట్టుబడి ఉండకుండా తగ్గించే పద్ధతి ని వ్యతిరేకించడం జరిగింది.పసుపు రైతుల సంఘం నాయకులు మలకా శివసాంబిరెడ్డి, వేముల వెంకటరామయ్యలు మాట్లాడుతూ ప్రభుత్వం పసుపు రైతులు మోసం చేసిందని కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతుందని దీన్ని సహించేది లేదని పూర్తిస్థాయిలో ఆనాడు అంగీకరించిన ప్రకారం 7000 ఇవ్వకపోతే మరొక పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. అధికారులను ప్రశ్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా తేల్చి చెప్పలేని చేతగాని ప్రభుత్వంగా మారిందని అన్నారు. నేడు పసుపు పంట కు 15 నుంచి 20 వేల వరకు ఉన్న నేపథ్యంలో ఆ పసుపు ఆ కోల్డ్ స్టోరేజీలో ఉన్నట్లయితే మంచి రేటు వచ్చేది అన్నారు. ప్రజలు డబ్బులతో కోల్డ్ స్టోరేజీ యాజమాన్యానికి 50 శాతం సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ లాభాలు సరిపోక రైతుల పంటలను దగ్ధం చేసి ఇన్సూరెన్స్ డబ్బులు అధికంగా వసూళ్లు చేయడానికి కోల్డ్ స్టోరేజ్ తగలబెట్టారన్నారు .దీనికి బలైనదిని రైతులే అన్నారు. ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అధిక లాభాలు అర్జించటానికి యాజమాన్యం దగ్ధం చేసుకునే దిగజారుడు పూనుకుంటున్నారన్నారు.దీనికి ప్రభుత్వాలు కూడా వత్తాసు పలుకుతున్నారన్నారు. గతంలో గుంటూరులో జిల్లాలో అనేక కోల్డ్ స్టోరేజీలు తగలబెట్టుకొని రైతులకు అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వాలు ఏమాత్రం వారి మీద చర్యలు తీసుకోకుండా యాజమాన్యం చెప్పిన మాటలే అంగీకరణంగా ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే జరిగితే ప్రభుత్వాం తగిన మూల్యం చెల్లించ తప్పదన్నారు. రైతుల నష్టపరిచిన ఏ ప్రభుత్వం కు మనగడ లేదన్నారు.

Author
Share This Article
Leave a review