దర్శి: ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని గుజ్జుల సరళదేవి భవన్‌లో సోమవారం ఎంఈఎఫ్, ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శేషయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, రచయితలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తొలుత గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి, సమానత్వ భావనకు తన రచనల ద్వారా బలమైన పునాది వేశారని వక్తలు పేర్కొన్నారు. అణగారిన వర్గాల సమస్యలను తన కవిత్వం ద్వారా సమాజం దృష్టికి తీసుకువచ్చిన జాషువా సాహిత్య సేవలు చిరస్మరణీయమని తెలిపారు.Prakasam District News
కార్యక్రమంలో బహుజన రచయితల వేదిక జిల్లా నాయకుడు అట్లూరి రామారావు, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు తాళ్లూరి ఆల్‌ఫ్రైడ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాచపూడి కరుణానిధి, ఎంఆర్‌పీఎస్ మండల అధ్యక్షుడు అనపర్తి జఫనియా, ప్రధాన కార్యదర్శి గర్నెపూడి అజయ్, ఎంఎస్‌పీ ప్రధాన కార్యదర్శి కనుమూరి సుధాకర్, ఎంఎస్‌ఎఫ్ అధ్యక్షుడు తాళ్లూరి జకరయ్య, ప్రధాన కార్యదర్శి జి. దానియేలు, బెన్నీ, ఏలియా, ఏ. దేవా తదితరులు పాల్గొన్నారు.



