Palnadu District City News :జీర్ణకోశ వ్యాధులపై నిర్లక్ష్యం వద్దు-లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.. యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు

S Sarath
1 View

పల్నాడు జిల్లా, నరసరావుపేట : అక్టోబర్ 15:-మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నాయని, ఈ వ్యాధుల లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ వైద్య నిపుణులు సూచించారు. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి పిత్తాశయం, క్లోమంలో రాళ్లు, జీర్ణకోశ క్యాన్సర్ల వరకు అనేక సమస్యలకు ప్రస్తుతం అత్యాధునిక వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

నరసరావుపేటలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ హెడ్ వీరంకి వెంకటేశ్వరరావు, ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ ఎర్రారపు శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. జీర్ణకోశ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలను వివరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఎర్రారపు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాంతంలో కారం, మిర్చి, మసాలాలు అధికంగా తీసుకునే ఆహారపు అలవాట్లతో ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. పిత్తాశయం (గాల్ బ్లాడర్), క్లోమం (ప్యాంక్రియాస్)లో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలు కూడా వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

గతంలో జీర్ణకోశ సంబంధిత అనేక సమస్యలకు పెద్ద కోతలతో కూడిన ఓపెన్ సర్జరీలు చేయాల్సి వచ్చేదని, ప్రస్తుతం లాప్రోస్కోపిక్, రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా చిన్న రంధ్రాలతోనే సంక్లిష్టమైన ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. దీనివల్ల ఆధునిక వైద్య విధానాలతో రోగులకు మెరుగైన చికిత్స అందించే అవకాశం ఉందన్నారు.

తీవ్రమైన ఎసిడిటీతో బాధపడేవారిలో యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా అన్నవాహిక దెబ్బతినకుండా ఉండేందుకు ఫండోప్లికేషన్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కాలేయం, జీర్ణాశయం, ప్రేగులకు సంబంధించిన క్యాన్సర్లకు కూడా లాప్రోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు చెప్పారు.Palnadu Local News

ఊబకాయం కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, పీసీఓడీ వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి బేరియాట్రిక్ సర్జరీ ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. కాలేయ సిర్రోసిస్‌తో బాధపడుతున్న ఎంపిక చేసిన రోగులకు కాలేయ మార్పిడి చికిత్స అందుబాటులో ఉందని, ఈ చికిత్సల్లో 95 శాతం విజయవంతమైన ఫలితాలు నమోదవుతున్నాయని వెల్లడించారు.

ఆరోగ్యకరమైన జీవనశైలితో వ్యాధులకు దూరం

జీర్ణకోశ సమస్యలను నివారించేందుకు సమయానికి భోజనం చేయడం, రోజుకు 6 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని డాక్టర్ శ్రీమన్నారాయణ సూచించారు. వేపుళ్లు, బయటి ఆహార పదార్థాలు, కూల్‌డ్రింక్స్ అధికంగా తీసుకోవడం, మద్యం సేవించడం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమని తెలిపారు.

స్థానిక ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకు గుంటూరులో ప్రతి నెలా మూడో శుక్రవారం ప్రత్యేక ఓపీడీ సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. జీర్ణకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు.

ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ మార్కెటింగ్ హెడ్ వీరంకి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎం. తిమోతి పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review