GUNTUR DISTRICT NEWS: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం

Karthik

స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ తెలిపారు. స్థానిక ఎన్నికల ముందస్తు ఏర్పాట్లు, సంసిద్ధతపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్ లు, ఇతర సామాగ్రి సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవిన్యూ అధికారి ఎన్.ఎస్.కె. ఖాజావలి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఐ.కిషోర్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వి.జ్యోతి బసు, జిల్లా పంచాయతీ అధికారి బి.వి. నాగ సాయి కుమార్, ఎం.టి.ఎం.సి కమిషనర్ అలీం భాషా, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పల నాయుడు, పొన్నూరు కమిషనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review