ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జి.జి.హెచ్) లో నిర్మాణానికి ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ ఆదేశించారు. సి.ఎస్.ఆర్ నిధులు రూ.5.27 కోట్లతో మంజూరు చేసిన భవన నిర్మాణ సమగ్ర ప్రణాళికపై జి.జి.హెచ్ లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నూతన భవనంలో ఆయా విభాగాల్లో ఉన్న పని ఒత్తిడి ఆధారంగా స్థల కేటాయింపు అవకాశాలు పరిశీలించాలని సూచించారు. భవన నిర్మాణ డిజైన్లలో ఎటువంటి లోపాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, ట్రామా కేర్ తో పాటు ఇతర విభాగాల అధిపతులు ఆయా విభాగాల అవసరాలను పక్కాగా రూపకల్పన చేసి భవనంలో ఉన్న విస్తీర్ణం మేరకు ప్రణాళికలు శనివారం నాటికి అందించాలని ఆదేశించారు. భవిష్యత్తు విస్తరణను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ప్రాధాన్యత, ప్రాముఖ్యత గల జి.జి.హెచ్ ను వైద్యులు అందరూ టీమ్ వర్క్ తో పనిచేసి పేరు ప్రతిష్టలు పెంపొందించాలని అన్నారు. వైద్యం కోసం వచ్చే వారికి మౌలిక వసతులు కల్పనలో శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. *ప్లాస్టిక్ సర్జరీ వార్డు పనులు పరిశీలన* స్థానికంగా లభ్యంగా ఉన్న నిధులు రూ.25 లక్షలతో మంజూరు చేసిన ప్లాస్టిక్ సర్జరీ వార్డు పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఎక్కడా వాటర్ లీకేజీలు ఉండరాదని ఎ.పి.ఎం.ఎస్.ఐ.డి.సి ఇంజనీర్ లను ఆదేశించారు. పనులు పూర్తి నాణ్యతతో ఉండాలని అన్నారు. నెల రోజుల్లో పారిశుధ్యం మెరుగుపడాలి. పారిశుధ్యం నెల రోజులలో మెరుగుపడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఓపీ, మరుగుదొడ్లు వద్ద పారిశుధ్యం మెరుగ్గా ఉండాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణపై ఎటువంటి పిర్యాదులు ఉండరాదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ దుర్గా ప్రసాద్, విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు.
GUNTUR DISTRICT NEWS: ఉపయుక్తమైన భవన నిర్మాణ ప్రణాళిక రూపొందించాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
26°C
Vijayawada
overcast clouds
26° _ 26°
94%
6 km/h
Thu
26 °C
Fri
30 °C
Sat
33 °C


