ముంబైలోని హోటల్ ఫెయిర్‌మాంట్‌లో నవంబర్ 25, 26 తేదీల్లో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ మేయర్ల సదస్సు (3rd World Mayors’ Forum), 7వ ఆసియా నగరాల సదస్సు (7th Asian Cities Summit 2026) కార్యక్రమంలో గుంటూరు నగర మేయర్ కోవెలమూడి లక్ష్మీ అపర్ణ పాల్గొన్నారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ సదస్సులో వివిధ నగరాల మేయర్లు, ప్రజాప్రతినిధులు, పట్టణాభివృద్ధి రంగ నిపుణులు పాల్గొన్నారు. పట్టణ పాలన, ఆధునిక మౌలిక సదుపాయాలు, సుస్థిర నగరాభివృద్ధి, ప్రజలకు మెరుగైన పౌరసేవలు వంటి కీలక అంశాలపై చర్చలకు ఈ సదస్సు వేదికగా నిలిచింది. గుంటూరు నగర మేయర్‌గా నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనడం విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
అంతర్జాతీయ వేదికపై గుంటూరు నగర మేయర్ లక్ష్మీ అపర్ణ – ప్రపంచ మేయర్ల సదస్సులో గుంటూరు నగరానికి ప్రాతినిధ్యం

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
31°C
Vijayawada
light rain
31° _ 31°
62%
4 km/h
Wed
30 °C
Thu
31 °C
Fri
31 °C


