
“మెదక్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. మూసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ఒక్కసారిగా మంటలు చెలరేగి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే, ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఒకవేళ ప్రయాణికులు ఉండి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేదని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా? లేక మరేదైనా సాంకేతిక లోపమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై బస్సు తగలబడుతున్న దృశ్యాలు చూసి వాహనదారులు బెంబేలెత్తిపోయారు. దీనికి సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.”


