
“రక్షించాల్సిన వారే భక్షకులుగా మారితే.. అండగా నిలవాల్సిన అధికారే అబలల పాలిట కీచకుడైతే.. ఆ వ్యవస్థకే తలవంపులు. నంద్యాల జిల్లాలో ఒక ఉన్నతాధికారి చేస్తున్న వేధింపుల పర్వం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. భర్తతో విభేదాలు, తల్లిదండ్రులు లేని ఒంటరితనం.. వీటన్నింటినీ ఆసరాగా చేసుకుని ఒక మహిళా ఉద్యోగినిని ఆ కీచక అధికారి నరకయాతనకు గురిచేస్తున్నాడు.”
“వివరాల్లోకి వెళ్తే.. తన భర్త నుంచి ముప్పు పొంచి ఉందని మంత్రికి మొరపెట్టుకున్న ఓ బాధితురాలికి, కలెక్టర్ ద్వారా నంద్యాలకు డిప్యుటేషన్ లభించింది. కానీ అక్కడ ఆమెకు ఆ అధికారి రూపంలో మరో ముప్పు ఎదురైంది. ఆమె దీనస్థితిని లొంగదీసుకోవడానికి పెట్టుకున్న సదరు అధికారి, అసభ్యకర సందేశాలతో వేధించడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఏడాది వయసున్న బిడ్డ కోసం సెలవు పెట్టి విధులకు హాజరైనా, తన కోరిక తీర్చాలంటూ నేరుగా వేధించడంతో ఆమె హతాశురాలయ్యారు. ఆయన మాట వినలేదని డిప్యుటేషన్ రద్దు చేయడమే కాకుండా, ఆమె వేరే చోట పోస్టింగ్ తీసుకున్నా.. తనిఖీల పేరుతో అక్కడికి వెళ్లి వేధింపులు కొనసాగిస్తున్నారు.”
“విడ్డూరం ఏమిటంటే.. సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటన పేరుతోనూ ఆ అధికారి తన వక్రబుద్ధిని చాటుకున్నారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాధితురాలిని తన కారులో రావాలని ఒత్తిడి చేయడం ఆయన నైజానికి నిదర్శనం. ఈ ఒక్క ఉద్యోగిని మాత్రమే కాదు, భర్త చనిపోయిన మరో మహిళా ఉద్యోగినిని, ఆఖరికి ఒక మహిళా పోలీస్‌ను కూడా వాట్సాప్ మెసేజ్‌లతో వేధించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా పోలీసులు, మహిళా ఎంపీడీవోలను అడ్డుపెట్టుకుని కేసులు కాకుండా మేనేజ్ చేస్తున్న ఈ కీచక అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ అరాచకంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.”


