గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా రూ.8.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే & టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గళ్ళా మాధవి శనివారం శంకుస్థాపన చేశారు. డివిజన్లలో రోడ్లు, సీసీ డ్రెయిన్లు, ఆర్‌సీసీ అవుట్‌ఫాల్ డ్రెయిన్లు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 21వ, 25వ, 43వ, 49వ డివిజన్లలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ డివిజన్లలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు కొత్తగా అవసరమైన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు, అవుట్‌ఫాల్ డ్రైన్లు, కల్వర్టులు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.8.50 కోట్ల వ్యయంతో పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు.ఈ నాలుగు డివిజన్లలో గత రెండేళ్ల కాలంలోనే ఇప్పటికే రూ.53 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ప్రస్తుతం చేపడుతున్న పనులతో కలిపి ఈ ప్రాంతాల్లో మొత్తం రూ.70 కోట్లకు చేరువలో అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయని, మిగిలిన రోడ్లు, డ్రైనేజీ మరియు ఇతర మౌలిక వసతుల సమస్యల పరిష్కారంపై కూడా ప్రత్యేక దృష్టి సారించి త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు.డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు నిరంతరం ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం వల్లే అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా అమలు చేయగలుగుతున్నామని చెప్పారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, కార్పొరేషన్ సిబ్బంది సమన్వయంతో అంచనాలు సిద్ధం చేసి పనులు ప్రారంభించడంలో సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.రానున్న ఏడాది కాలంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటు లేకుండా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రజాప్రతినిధుల బాధ్యతగా భావించి పనిచేస్తున్నామని, నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు డివిజన్ నెం.43 రూ.195 లక్షలతో సిద్ధార్థ నగర్ నుంచి కొరిటెపాడు 1వ లైన్ వరకు ఉత్తరం వైపున RCC అవుట్‌ఫాల్ డ్రెయిన్, రింగ్ రోడ్డు నిర్మాణం. (15వ ఆర్థిక సంఘం గ్రాంట్)రూ.35 లక్షలతో ముత్యాలరెడ్డి నగర్ మెయిన్ రోడ్ నుంచి ద్వారకా నగర్ మెయిన్ రోడ్ వరకు ముత్యాలరెడ్డి నగర్ 9వ లైన్‌లో CC రోడ్డు, RCC కల్వర్టు నిర్మాణం.రూ.20 లక్షలతో ముత్యాలరెడ్డి నగర్ 9వ లైన్ కట్ రోడ్డుకు CC డ్రెయిన్ల నిర్మాణం.రూ.64 లక్షలతో లిటిల్ ఫ్లవర్ స్కూల్ రోడ్డుకు ఎదురుగా ఉన్న విద్యానగర్ 1వ లైన్ నుంచి సాయిబాబా రోడ్డుకు ఇరువైపులా, విద్యానగర్ 0వ లైన్ వరకు CC డ్రెయిన్లు, CC రోడ్డు నిర్మాణం.డివిజన్ నెం.45 రూ.49 లక్షలతో గౌతమి నగర్ 2వ లైన్‌లో CC డ్రెయిన్లు, CC రోడ్డు నిర్మాణం.రూ.46 లక్షలతో చైతన్యపురి కాలనీ 3వ లైన్‌లో CC డ్రెయిన్లు, CC రోడ్డు నిర్మాణం.రూ.49.90 లక్షలతో ముత్యాలరెడ్డి నగర్ 1వ లైన్‌లో CC అవుట్‌ఫాల్ డ్రెయిన్ బెడ్ ఏర్పాటు.రూ.45.90 లక్షలతో చైతన్యపురి కాలనీ 4వ లైన్‌లో CC డ్రెయిన్లు, CC రోడ్డు నిర్మాణం. డివిజన్ నెం.49 రూ.128 లక్షలతో భరత్‌పేట 4వ లైన్ నుంచి లాడ్జ్ సెంటర్ వరకు అమరావతి రోడ్డు తూర్పు వైపున CC అవుట్‌ఫాల్ డ్రెయిన్ నిర్మాణం. (15వ ఆర్థిక సంఘం గ్రాంట్)రూ.20.30 లక్షలతో భరత్‌పేట 8వ లైన్ క్రాస్ రోడ్డులో CC డ్రెయిన్లు, CC రోడ్డు నిర్మాణం. డివిజన్ నెం.21 రూ.40 లక్షలతో సాయి సౌందర్య అపార్ట్‌మెంట్ VIP రోడ్ ప్రవేశద్వారం నుంచి ఏతురాజుల నగర్ 1వ లైన్ వరకు CC రోడ్డు నిర్మాణం. డివిజన్ నెం.25 రూ.25 లక్షలతో తిరుపతమ్మ తల్లి గుడి రోడ్డు నుంచి కొత్త కాలనీ అనుసంధాన రహదారి వరకు BT రోడ్డు నిర్మాణం.రూ.40 లక్షలతో అమ్మ ఆశ్రమం పక్కన ఉన్న సాయినగర్ వీధిలో CC రోడ్డు, మాన్ రోడ్డు నుంచి లక్ష్మీనగర్ సాయినగర్‌కు కలిపే రహదారి నిర్మాణం.రూ.20 లక్షలతో తిరుపతమ్మ తల్లి గుడి రోడ్డు నుంచి కోట్నా అనుసంధాన రోడ్డుకు CC డ్రెయిన్ల నిర్మాణం.రూ.50 లక్షలతో లాలూపురం దొంక రోడ్డు సమీపంలోని కావేరి కాలనీ 8వ లైన్‌లో CC డ్రెయిన్, వెట్‌మిక్స్ రోడ్డు నిర్మాణం.



