
మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం రవాణా కాంట్రాక్టులు, టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఈ కేసు విచారణలో భాగంగా శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో కారుమూరి నాగేశ్వరరావుతో పాటు ఆయన కుమారుడు సునీల్ కు కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 23న విజయవాడలో విచారణకు హాజరుకావాలని ఆదేశించినప్పటికీ, వారు హాజరుకాకపోవడంతో అధికారులు నేరుగా తనిఖీలకు దిగారు. తణుకులోని ఆయన నివాసానికి కూడా ఇప్పటికే నోటీసులు అందజేశారు.
Total Views: 0


