GUNTUR DISTRICT NEWS: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి కుట్రలు

Karthik

నామినేషన్ల స్థాయిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు.ఈమేరకు అంబటి రాంబాబు తోపాటు మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా, ఎమ్మెల్సీ ఏసురత్నం, డైమండ్ బాబు, అంబటి మురళి తదితరులు కలెక్టర్ కార్యాలయంలో గురువారం అధికారులను కలిశారు.కుల దృవీకరణ పత్రాలు, ఎన్ఓసీల జారీలో ఎదురౌతున్న ఇబ్బందులు గురించి వివరించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడారు. సకాలంలో కుల దృవీకరణ పత్రాలు, ఎన్ఓసీలు ఇవ్వకుండా అధికారులు కుంటి సాకులు చెబుతున్నారు. కుట్రలు పన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రిజర్వేషన్ల సీట్లలో పోటీ చేసే అభ్యర్థులకు కుల దృవీకరణ పత్రాలు ఇవ్వకపోతే నామినేషన్లు తిరస్కారానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఆటంకాలు ఏర్పడితే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.కూటమి పరిపాలనలో ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో పెరిగింది. ఆ వ్యతిరేకతతో లోకల్ బాడీ ఎలక్షన్ లో అత్యధిక సీట్లు గెలుస్తామని అంబటి ధీమా వ్యక్తం చేశారు.

Author
Share This Article
Leave a review