GUNTUR CITY NEWS: ఇళ్ళు కూల్చారు … పేదలను రోడ్డున పడేశారు…

Karthik
8 Views

గుంటూరు తూర్పు నియోజకవర్గంమోతీలాల్ నగర్లో ఉద్రిక్తత నెలకొంది.అధికారులు.. పేదల ఇళ్లు తొలగించారు.వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి పేదల ఇళ్లను అధికారులు తొలగించారు. తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా ఎలా ఇల్లు తొలగిస్తారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయం చేయమని ఎమ్మెల్యే నజీర్ దగ్గరికి వెళ్తే నీచంగా మాట్లాడారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రైలు కిందపడి చావండంటూ సలహా ఇచ్చారని బాధితులు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే నజీర్ పై బాధితులు దుమ్మెత్తి పోశారు. మోతిలాల్ నగర్లో పర్యటించిన వైఎస్సార్సీపీ నగర అధ్యక్షురాలు నూరీ ఫాతిమా బాధితులను పరామర్శించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ఇల్లు తొలగించాలని డిమాండ్ చేశారు.

Author
Share This Article
Leave a review