ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది త్రాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, త్రాగునీటి సరఫరా జరుగు సమయంలో ప్రతి రోజు ప్రతి రిజర్వాయర్ పరిధిలో తప్పని సరిగా త్రాగునీటి టెస్టింగ్ పనులు నూరు శాతం జరగాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజనీరింగ్ కారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులు సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో అన్ని రిజర్వాయర్ల పరిధిలో ప్రతి రోజు త్రాగునీటి సరఫరా సమయంలో శాంపిల్స్ సేకరించి తనిఖీ చేయాలన్నారు. త్రాగునీటి కాలుష్యం జరిగితే ప్రజల ఆరోగ్యానికి తీవ్ర సమస్యలు వస్తాయని, డ్రైన్ ని క్రాస్ చేసి ఇంటికి త్రాగునీరు అందే ప్రతి పైప్ లైన్లను ఈ నెలాఖరు నాటికి తప్పని సరిగా మార్చుకోవాల్సిందేనన్నారు. నగరంలో ఉన్న బోర్ వేల్స్ మరమ్మతులకు లోనై ఉంటె వెంటనే వాటికి మరమ్మతులు నిర్వహించాలన్నారు. పబ్లిక్ టాయిలెట్స్ మరమ్మతులు ఏమైనా ఉంటె వెంటనే వాటికి మరమ్మతులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఏ.ఈ ల వారి వారి డివిజన్లలోని అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొని పెండింగ్ ఉన్న వెంటనే అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, సదరు పనులు పూర్తైన వెంటనే బిల్లుల చెల్లింపుకు నిధి పోర్టల్ లో అప్ లోడ్ చేయాలన్నారు. నగరంలోని ప్రతి స్మశానవాటికలో మౌలిక వసతుల కల్పన చేయుటకు సంబంధిత ఏ.ఈలు వారి పరిధిలోని స్మశానవాటికలలో పర్యటించి సమస్యలను గుర్తిచి, అవసరమైన మౌలిక సదుపాయాలు కలిపించాలన్నారు. అలాగే నగర పాలక సంస్థ పార్కులలో అనుమతించిన అభివృద్ధి పనులను, జియంసి ఓపెన్, రిజర్వ్ సైట్లలో పార్కులను అభివృద్ధి చేయాలన్నారు. నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జియంసి చలివెంద్రాలను త్వరితగతిన ఏర్పాటుకు చేశామని, ఇంకా అవసరమైన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని ప్రాధాన అవుట్ ఫాల్ డ్రైన్లలో డీసిల్టింగ్ పనులను అన్ని డివిజన్లలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా పాట్ హోల్స్ లేకుండా వెంటనే వాటికి మరమ్మతులు నిర్వహించాలన్నారు. వర్షాకాల ముందస్తు కార్యాచరణ ప్రణాళిక క్రింద ఆమోదించిన పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలన్నారు. సమావేశంలో యస్.ఈ జి. వెంకటేశ్వరావు, ఈఈలు సుందర రామిరెడ్డి, వేణు, విష్ణు, డిఈఈలు, ఏఈలు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: సమర్ధవంతంగా తాగునీటి సరఫరా జరగాలి

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
32°C
Vijayawada
overcast clouds
32° _ 32°
61%
2 km/h
Sun
32 °C
Mon
35 °C
Tue
36 °C


