గుంటూరు నగరంలో వీధి కుక్కలా కుటుంబ నియంత్రణ (ఏబీసి), యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్ లను యుద్దప్రాతిపదికన చేపడుతున్నామని, మరో 3 వారాల్లో అదనపు ఏబీసి సెంటర్ ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. శనివారం పొన్నూరు రోడ్ లోని ఏబీసి సెంటర్ ని పరిశీలించి, అదనపు సెంటర్ నిర్మాణ పనులు, ప్రస్తుతం జరుగుతున్నఏబీసి, మౌలిక వసతులను తనిఖీ చేసి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రతి రోజు 2 వందల వీధి కుక్కలకు ఏబీసి చేసే లక్ష్యంతో అదనపు సెంటర్ ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదనపు సెంటర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ 3 వారాల్లో పూర్తి చేసేలా ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే ఏబీసి సెంటర్ పరిసరాల్లో సిసి కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, ఫుటేజి స్టోరేజ్ కి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విఏఎస్ కి స్పష్టం చేశారు. ఏబీసి, ఏఆర్వీ చేసిన అనంతరం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఫీడింగ్ అందించాలని, తదుపరి ఎక్కడ పట్టుకోచ్చారో అక్కడే వదలాలన్నారు. సెంటర్ పరిసరాల్లో పారిశుధ్యంకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్ల నిర్మాణ పనులను ఈఈని అడిగి తెలుసుకొని, త్వరితగతిన జరిగేలా చూడాలన్నారు. వార్డ్ ల వారీగా నిర్మాణ వ్యర్దాలు రోడ్లపై ఉండడానికి వీలు లేదని, గోడలపై పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. తొలగించిన అనంతరం కూడా పోస్టర్స్ అంటిస్తే భారీ అపరాధ రుసుం విధించాలని స్పష్టం చేశారు. నగరంలోకి వచ్చే మార్గాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. హోమ్ కంపోస్ట్, క్లస్టర్ కంపోస్ట్ ప్రక్రియలు సక్రమంగా జరిగేలా చూడాలని, ప్రతి ఇంట్లో సోర్స్ సెగ్రిగేషన్ (చెత్త విభజన) అమలు చేయాలని సూచించారు. నగరంలో అక్కడక్కడ కనిపిస్తున్న గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ (జివిబీ) పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, అసలు ఆ పాయింట్లు ఎందుకు ఏర్పడుతున్నాయో సమీక్షించుకోవాలని తెలిపారు. తమ సచివాలయ పరిధిలో మరియు వార్డులో ఎక్కడా జీవీబీ పాయింట్లు లేవని సంబంధిత సెక్రటరీలు, ఇన్స్పెక్టర్లు ధృవీకరణ పత్రాలు అందించాలని ఆదేశించారు.పర్యటనలో ఈఈ సుందర్రామిరెడ్డి, డిఈఈ సతీష్, ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
GUNTUR CITY NEWS: వీధి కుక్కలకు వేగంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
broken clouds
30° _ 30°
74%
3 km/h
Sat
33 °C
Sun
37 °C
Mon
34 °C


