GUNTUR CITY NEWS: వ్యాపారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్సులు పొందాలి

Karthik

గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో వ్యాపారము నిర్వహించు ప్రతి ఒక్క షాపు యజమాని డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగర పాలక సంస్థ పరిధిలో వ్యాపారము చేయు ప్రతి ఒక్క షాపు యజమాని నగర పాలక సంస్థ చట్టము సెక్షన్ 521 ప్రకారం విధిగా డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్సు కలిగియుండాలని, గతంలో లైసెన్సు పొంది ప్రస్తుతం వ్యాపారము నిర్వహించుచున్న వారు 2026-27 సంవత్సరానికి సంబంధించి లైసెన్స్ రెన్యువల్ చేయించుకోవాలని తెలియచేశారు. అలాగే నూతనంగా వ్యాపారము ప్రారంభించిన వారు మరియు వ్యాపారము చేయుచు లైసెన్స్ లేని వారు డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ పొందుటకు మీ ఏరియాలోని శానిటరీ సెక్రటరీ, ఇన్స్పెక్టర్ లేదా సచివాలయ కార్యాలయంలో సంప్రదించి లైసెన్స్ పొందాలని తెలియచేశారు. నగర పరిధిలో వ్యాపారము నిర్వహించు వారికి తప్పనిసరిగా డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ లేకుండా వ్యాపారము నిర్వహించుచు ఉంటారో అటువంటి వారి షాపులను నగర పాలక సంస్థ చట్టము సెక్షన్ 521 ప్రకారం నోటీసులు జారీ చేసి, సెక్షన్ 622(4) ల ప్రకారం సదరు షాపులను సీలు వేయుట జరుగుతుందని తెలియచేశారు.

Author
Share This Article
Leave a review