GUNTUR CITY NEWS: మీ వద్దకు – మీ గళ్ళా మాధవి పేరుతో ప్రజలకు మరింత చేరువగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Karthik

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్, ప్రతి బూత్ పరిధిలో జూలై 1వ తేదీ నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకోవటానికి “మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమం చేపట్టానని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలి రోజు 45వ డివిజన్‌లోని 72వ బూత్ పరిధిలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇక పై ప్రతి బూత్ పరిధిలో ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించడం, పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి ముందుకు సాగుతున్నారు.ప్రజలకు మరింత చేరువ కావడం, సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి వేగంగా పరిష్కరించడం, పార్టీ శ్రేణులతో సమన్వయం పెంపొందించడం, ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడం కోసం “మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమం కీలక వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు.

Author
Share This Article
Leave a review