ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమనే సంకల్పంతో ప్రత్తిపాడు మండలం, నడింపాలెంలో నిర్మించనున్న “ఆయుష్ హాస్పిటల్ మరియు అనుబంధ సంస్థల నిర్మాణ” స్థలాన్ని నేడు కేంద్ర బృందం మరియు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మతో కలిసి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బి. రామాంజనేయులు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే కేంద్ర బృంద నిపుణులకు మరియు కలెక్టర్ ని శాలువాతో సత్కరించి హృదయపూర్వక ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి రూ.100 కోట్ల వ్యయంతో 100 పడకల హాస్పిటల్ ను ప్రత్తిపాడు నియోజకవర్గ పరిధిలోనే నిర్ణయించడం, దాని మేరకు కేంద్ర నిపుణులు ఇప్పటికే రెండవసారి పర్యటించడం జరిగింది. మొదటిసారి కొన్ని అభ్యర్థనలు సమర్పించగా వాటిని జిల్లా కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ గారు, ఆయుష్ డైరెక్టర్ ఆ సమాధానాలన్నింటికీ జవాబు ఇవ్వడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో రెండోసారి కేంద్ర బృందం పరిశీలించడం జరిగింది. నడింపాలెంలో 15 ఎకరాల భూమిని ఇవ్వడానికి స్థానిక ప్రజలు, కలెక్టర్ మరియు ప్రజా ప్రతినిధిగా అంగీకరించామని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు విషన్ 2047, ఆరోగ్య ఆంధ్ర ఆలోచనలో భాగంగానే ఈ కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుంది. ఇది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వం అని, మా ప్రభుత్వం ఏదైతే చెబుతుందో అది కచ్చితంగా చేసి చూపిస్తాం అనే అవగాహన ప్రజలు గమనిస్తున్నారని ఎమ్మెల్యే గారు తెలిపారు. ఈ సందర్భంగా అతి త్వరలోనే ఆయుష్షు హాస్పిటల్ మరియు యోగ హాస్పిటల్ ప్రారంభం అవుతుందని ఆశించారు.



