Vijayawada City News :చిట్టినగర్‌లో ఉచిత మట్టి గణపతుల పంపిణీ-పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

Sharat
1 View

విజయవాడ, సెప్టెంబర్ 13: విజయవాడ చిట్టినగర్ సెంటర్‌లో 47వ డివిజన్ జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కరణం దివాకర్ బాబు, ఎరుపల్లి కనకారావు ఆహ్వానం మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు మట్టి గణపతి విగ్రహాలను ఉపయోగించి పర్యావరణహితంగా పండుగను నిర్వహించాలని నిర్వాహకులు సూచించారు.

కార్యక్రమంలో జనసేన నాయకులు పొట్నూరి శంకర్, చలపాక సురేష్, పిల్లా సురేష్, పిల్లా నరేష్, దింది నాని, దాసిన జగదీష్, సమతం సత్తిబాబు, కోన రాకేష్, వీర మహిళ, ఎస్టీ మహిళా నాయకురాలు ఆకారపు విజయ్ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review