Bapatla District City News :నిరుపేద వృద్ధురాలికి బియ్యం, నిత్యావసర సరుకుల సాయం

S Sarath
1 View

కర్లపాలెం:– మండలంలోని కర్లపాలెం పంచాయతీ యాదవపాలెంకు చెందిన నిరుపేద వృద్ధురాలికి రెడ్డి సేవా మిత్ర ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా రెడ్డి సేవా మిత్ర సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. కర్లపాలెం మండలంలోని 20 గ్రామ పంచాయతీల్లో కులమతాలకు అతీతంగా వివిధ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.Bapatla district city News

కార్యక్రమంలో మాజీ సర్పంచ్, బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బన్నారావూరి శ్రీనివాసరావు, రెడ్డి సేవా మిత్ర అధ్యక్షుడు నంగు గోవర్ధన్ రెడ్డి, సెక్రటరీ ఏట్రా ప్రసాద్ రెడ్డి, కోశాధికారి అట్ల హరిబాబు రెడ్డి, బుర్ల శివప్రసాద్, గవిని వెంకటేశ్వర్లు, బుర్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Author
Share This Article
Leave a review