GUNTUR DISTRICT NEWS: ల్యాండ్ పూలింగ్ నుంచి మా భూములను తొలగించండి

Karthik

తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీడ్ యాక్సెస్ రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. జగన్‌ను కలిసిన 30 మందిని ఫేక్ రైతులు అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు అంటూ రైతులు స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు అవకాశం దొరకలేదని రైతుల ఆవేదన. కొండవీటి వాగుకి, సీడెక్స్ రోడ్డుకి రైతులను పూలింగ్‌కు ఒప్పించాం, ప్లాట్లు ఇస్తామని ఇవ్వలేదు. అభివృద్ధికి తోడ్పడుతుంటే సీఆర్డీఏ వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. విజయవాడ కిలోమీటర్ దూరం, ఇక్కడ 2015లోనే విల్లాలు, 2014కి ముందే అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇంత అభివృద్ధి చెందిన ఊర్లో మమ్మల్ని రైతులే కాదంటే ఎలా అని ప్రశ్న. ఉండవల్లిని ఎల్పీఎస్, ఎల్ఏ నుంచి విరమింప చేయాలని డిమాండ్. న్న, చిన్నకారు రైతుల భూముల్ని ప్రాజెక్టు లేకుండా అనవసరంగా తీసుకోవద్దని వినతి. మా భూముల్ని ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ పూలింగ్ నుంచి పూర్తిగా తప్పించండి‌ 2014లో రాజధాని రాకముందే ఉండవల్లి హై లెవెల్‌లో ఉందితాడేపల్లి తర్వాత టాప్ ఊరు ఉండవల్లి గ్రామం అని రైతుల వ్యాఖ్య. జగన్, సీపీఎం బాబురావు, డాక్టర్ వసుంధరని కలిశామని వెల్లడి. మిగిలిన భూమిని ఎల్పీఎస్‌లో పెట్టారు, దాన్ని తీసేయండి అని డిమాండ్. పవన్ కళ్యాణ్, లోకేష్ అపాయింట్‌మెంట్ అడిగాం దొరకలేదని ఆవేదన. లోకేష్ మీరు మా ఎమ్మెల్యే, మా బాధలు వినాలి” అంటూ రైతుల విజ్ఞప్తి. మీడియా ద్వారా అపాయింట్‌మెంట్ అడుగుతున్నామని వెల్లడి. ఉండవల్లి రైతులకు అవకాశం ఇస్తే మెమొరాండం ఇచ్చి బాధలు చెప్పుకుంటామని స్పష్టం. జగన్ కలిసిన రైతులు అసలు రైతులే కాదంటూ కొన్ని మీడియాలలో దుష్ప్రచారం పై మండిపడ్డ రైతులు. ఉండవల్లిలో పెనుమాక వాళ్ళకి ఎలాంటి భూములు లేవంటూ ఫేక్ రైతులంటూ టీడీపీ నేతలు ప్రచారం చేయడంపై ఆగ్రహం. జగన్‌ని కలిశామనే అక్కసుతో తమను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడుతున్న రైతులు. మా గ్రామంలో వేరే గ్రామ రైతులుకి ఎల్పీఎస్ లేఔట్స్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. మా సమస్య పరిష్కారం కోసం మాత్రమే జగన్ ను కలిశాం, మాజీ సీఎం అని కలిశాం తప్పు ఏమిటి. పవన్ కళ్యాణ్, లోకేష్‌లు కనీసం అపాయింట్‌మెంట్లు ఇవ్వడంలేదు, ఇంక మేము ఎవరికి చెప్పుకోవాలి. అవసరమైతే మిగతా రాజకీయ పార్టీల నేతలను కూడా కలుస్తామని వెల్లడి. మా సమస్యను రాజకీయ కోణంలో చూడొద్దని విజ్ఞప్తి. రాజధాని అన్ని కులాలు, అన్ని మతాలకు చెందింది, కులాల పేరుతో కించపరచవద్దని కోరిక. దయచేసి ల్యాండ్ పూలింగ్ నుండి మా భూములను మినహాయించండి. ఇంకా మేము భూములు ఇచ్చే పరిస్థితి లేదని రైతుల తేల్చిచెప్పారు.

Author
Share This Article
Leave a review