Krishna District City News :బాపులపాడులో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ సరళిని పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు

S Sarath
1 View

బాపులపాడు, నవంబర్ 5:- కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలు–2026లో భాగంగా బాపులపాడు మండలంలో గురువారం నిర్వహించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి. అభిషేక్ పరిశీలించారు.

మండలంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ఆయన, క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ తీరును సమీక్షించారు. ఇందులో భాగంగా బాపులపాడు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.

పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, ఎన్నికల సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించాలని అధికారులకు సూచించారు.Krishna district news

ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు వి. అభిషేక్ ఆదేశించారు.

Author
Share This Article
Leave a review