Palnadu Local News :వినుకొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి పిలుపు-పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలి-బొల్లా బ్రహ్మనాయుడు

Sharat
3 Views

వినుకొండ: వినుకొండ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. శుక్రవారం వినుకొండలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రేపు జరగనున్న నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం, పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంపై చర్చించారు.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు బ్రహ్మనాయుడు కన్వెన్షన్ హాల్‌లో వినుకొండ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు.PALNADU DISTRICT NEWS: ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది: విడదల

నియోజకవర్గంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అన్ని అనుబంధ విభాగాల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ శ్రేణులు సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని బొల్లా బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా పార్టీ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Author
Share This Article
Leave a review