గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిన్నపాలెం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా 14 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది.పదిమంది రైతులు ఒక్కొక్కరు ఎకరన్నర , రెండు ఎకరాలు చొప్పున మొక్కజొన్న సాగు చేశారు. మొక్కజొన్న సాగు కి ఎకరానికి 50,000 నుండి 60,000 దాకా పెట్టుబడి అయింది. అయితే కరెంట్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల తెగి క్రిందనున్న మొక్కజొన్న పంటపై పడి మంటలు చెలరేగాయి.పంట మెత్తం దగ్దంమైనదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు.కేవలం లైన్మెన్ ఆలస్యం అసమర్థత వల్లే ఈ కరెంటు వైర్లు కిందపడి షార్ట్ సర్క్యూట్ సంబంధించినది అని రైతులు తెలిపారు.స్థానిక రైతులు దగ్గర నుంచి మోటార్ కి ఫీజు వేయాలంటే లైన్ మెన్ 200 నుంచి 500 రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని చెప్పారు.గతంలో మోటర్లు బిగించడానికి ఒక రైతు దగ్గర నుంచి ఒక మోటార్కు 20 నుండి 40,000 వసూలు చేశాడని స్థానిక రైతులు ఆరోపించారు.
GUNTUR DISTRICT NEWS: దుగ్గిరాల మండలంలో అగ్ని ప్రమాదం – అగ్నికి ఆహుతి అయిన మొక్కజొన్న పంట

Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a review Leave a review
Stay Connected
Weather
30°C
Vijayawada
scattered clouds
30° _ 30°
70%
3 km/h
Fri
30 °C
Sat
39 °C
Sun
39 °C


